లైగర్ లో మైక్ టైసన్ విలనా!!
విజయ్ దేవరకొండ లాంటి సాధారణ హీరో ఈ ప్రభంజనాన్ని సృష్టించగలిగాడు అంటే నిజంగా ఆయనకు ఎంత మంచి టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో అర్జున్ రెడ్డి సినిమా తో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఆయనను అందుకోవడం ఎవరి తరం కూడా కాలేకపోయింది. గత రెండు సినిమా లుగా వెనక పడిపోయిన విజయ్ దేవరకొండ టాప్ హీరో ల రేస్ లోకి రావాలని భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే అగ్ర దర్శకుడితో కలిసి ఆగస్టు 25 వ తేదీన లైగర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ విధంగా విజయ్ దేవరకొండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఉండేలా చేసుకున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్ నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఆ విధంగా ఈ సినిమాలో మైక్ టైసన్ విలన్ గా నటించబోతున్నాడు అనే విషయం విజయ్ అభిమానులను సంతోషపడుతుంది. మైక్ టైసన్ ను తలబడడం అంటే అది మామూలు విషయం కాదు. విడుదల కు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.