కరోనా వైరస్ తాజా వేవ్‌తో మరోసారి పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా వాయిదాల బాటలోకి వచ్చేశాయి.'ఆర్ఆర్ఆర్' సినిమాతో మొదలై 'ఆచార్య' సినిమా దాకా వాయిదాలు వేస్తున్నారు. ఇంకా ఈ కోవలోకి మరికొన్ని సినిమాలు కూడా వస్తాయి అని కూడా టాక్ విపిస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం వాయిదాలు కాదు. కొత్త రిలీజ్ డేట్లు అని చెప్పాలి. అవును 'ఆచార్య' సినిమా కొత్త తేదీని ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్లో మరో చర్చ మొదలైంది.కరోనా తాజా వేవ్ నేపథ్యంలో ఇప్పటి దాకా వాయిదా పడిన సినిమాలు చూస్తే 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'ఆచార్య' సినిమాలు ఉన్నాయి. వీటికి కొత్త డేట్లు అనేవి కావాలి. వీటికితోడు వాయిదా వేసుకున్న 'గని' సినిమాకి కూడా కొత్త డేట్ కావాలి. వీళ్లంతా సరైన తేదీకి కోసం ఎదురు చూస్తున్నారు. 'ఆచార్య' సినిమా టీమ్ అయితే ముందుగా మేల్కొని ఏప్రిల్ 1 అంటూ డేట్ పై కర్చీఫ్ వేసేసింది.ఇక షూటింగ్ లేట్ కారణంగా ఆ రోజు విడుదల కావాల్సిన 'సర్కారు వారి పాట' వాయిదా పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దాని కోసం కూడా ఓ డేట్ కావాలి.
మేకి ఆ సినిమా రిలీజ్ అవుతుందని టాక్ వస్తుంది.
ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా, 'రాధేశ్యామ్' సినిమా కూడా సమ్మర్‌నే టార్గెట్ చేశాయి అంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్లు ప్రకటిస్తారని సమాచారం తెలుస్తుంది. మధ్యలో వరుణ్‌తేజ్ 'గని' సినిమా కోసం అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కాకుండా ఫిబ్రవరి నెలలో రావాల్సిన మిగిలిన సినిమాలు కూడా వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే నెలలో కరోనాకేసుల ప్రభావం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాల వాయిదా కూడా పక్కా అని టాక్ నడుస్తుంది.. ఇక ఆ లెక్కన ఫిబ్రవరి నెలలో ఆఖరున 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ అవ్వాలి.ఇక ఆ రోజుకే తెస్తారో లేక వాయిదా వేస్తారో అనేది చూడాలి. పవర్ కల్యాణ్ అయితే కరోనా పరిస్థితులు నెమ్మదించాకే షూటింగ్ అన్నారని సమాచారం.దీంతో 'భీమ్లా నాయక్' మిగిలిన షూటింగ్ పెండింగ్‌లో ఉంది.
ఇది కాకుండా 'ఖిలాడీ', 'మేజర్' సినిమాలు కూడా ఉన్నాయి. వాటి విడుదల సంగతేంటో ఇక చూడాలి. అలాగే మార్చిలోనూ కరోనా పరిస్థితులు అనేవి కుదుటపడకపోతే 'శేఖర్', 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి సినిమాలు కూడా వాయిదా పడే ఆలోచన చేయొచ్చు. అప్పుడు మొత్తంగా చాలా సినిమాలు విడుదలకు ఇబ్బంది పడతాయి.ఈ క్రమంలో ఒకరి కోసం ఒకరు వాయిదాల పడే ఛాన్స్ ఉంటుంది. గతంలో తేదీలు ప్రకటించిన వాళ్లు వెనక్కి వెళ్తారా? లేదా కొత్తవాళ్లే వాళ్ల కోసం వాయిదాలు వేస్తారా అనేది ఇంకా తేలడం లేదు. ఏప్రిల్ నెలలో విడుదల అంటూ గతంలోనే 'సలార్', 'ఎఫ్ 3', 'హరి హర వీర మల్లు' లాంటి సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.