ఈ వారం ఆసక్తి పరిచే ఓటీటీ రిలీజ్ లు!!
బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరొకసారి పరిచయం చేసిన ఈ సినిమా సరైన టైంలో విడుదలయ్యి భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఊపిరి తీసుకువచ్చిన సినిమాగా అఖండ సినిమాను అప్పట్లో అభివర్ణించారు. అలాంటి ఈ సినిమా సంక్రాంతికి ఓటీటి లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరు భావించగా ఈ సినిమా అప్పుడు రాకపోవడం ఒక్కసారిగా అందరినీ తీవ్రమైన నిరాశ లోకి ముంచింది. దాని తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఓ టీ టీ లో వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఇంకా రాకపోవడంపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమాను జనవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హాట్ స్టార్ లో ఇది విడుదల అవుతుంది. దీని పట్ల బాలకృష్ణ అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన డాడీ బ్రో చిత్రాన్ని కూడా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విధంగా ఈ నెలలో వచ్చే రెండు వారాల్లో రెండు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను చూసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా లు ఏ స్థాయిలో రేటింగ్ ను అందుకుంటాయో చూడాలి.