ఫ్యామిలీకి నచ్చని అర్జున్ రెడ్డి రొమాన్స్... అయినా ఇండస్ట్రీ హిట్
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ సినిమాకి కీలకంగా మారింది. కోపం కంట్రోల్ చేసుకోలేని సన్నివేశాల్లో, రొమాంటిక్ సీన్స్ లో, ఎమోషనల్ సన్నివేశాల్లో, సెంటిమెంటల్ సీన్లు దేనికదే హైలెట్ గా చేశాడు హీరో విజయ దేవరకొండ. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో ఈ హీరో ఎమోషన్ తో కూడిన యాక్షన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. అప్పట్లోనే విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదుగుతాడు అని అంతా ఊహించారు. అందరూ అనుకున్న విధంగానే నేడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
కొత్త రకమైన రొమాన్స్ కు శ్రీకారం చుట్టిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మార్గదర్శిగా నిలిచాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొదట్లో ఈ రొమాన్స్ ను కుటుంబ ప్రేక్షకులు వ్యతిరేకించినా ఆ తర్వాత యువత ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తర్వాత కొన్ని చిన్న సినిమాలు కేవలం రొమాన్స్ మీద ఆధారపడి తెరకెక్కి హిట్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి.