ఆచార్య హిట్ విషయంలో కాజల్ పాత్ర కీలకమట..
2010 వ సంవత్సరంలో ఏప్రిల్ నెల లో విడుదలైన డార్లింగ్ సినిమాతో కాజల్ అగర్వాల్ హిట్ ను సొంతం చేసుకున్నది.2011 వ సంవత్సరంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో కాజల్ అగర్వాల్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాతో కాజల్ ఖాతాలో మరో హిట్ చేరింది. అయితే ఏప్రిల్ నెలలో కాజల్ అగర్వాల్ నటించి విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం ప్లాప్ గా నిలిచి ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచడం జరిగింది. ఇక ఆచార్య సినిమాకు కాజల్ సెంటిమెంట్ కలిసొస్తుందని అభిమానులు ఎంతగానో భావిస్తున్నారు.ఇక మరోవైపు డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ని సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోలేదు.ఇక ఈ ఆచార్య సినిమాపై అభిమానుల నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మరో మూడు నెలలు వెయిట్ చెయ్యాల్సిందే