శృతిహాసన్ వల్లే.. పూజా హెగ్డే హాట్ స్టార్ హీరోయిన్ అయిందట.. అవునా?
ఇక అదే సమయంలో అటు బాలీవుడ్ లో కూడా తన లక్ ను పరీక్షించుకుంటూ అక్కడ మెల్లిమెల్లిగా స్టార్ హీరోయిన్గా మారేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది పూజా హెగ్డే. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది. దీంతో ఈ అమ్మడికి మరింత క్రేజ్ వస్తుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ రేంజ్ కు రావడానికి శృతి హాసన్ కారణమట. ఎలా అంటారా.. శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమా పూజా హెగ్డే చేయడం వల్లే ఇక కెరీర్ మలుపు తిరిగిందట.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించి ఇక తన అందాలతో కూడా అందరినీ మైమరిపింప చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ముందుగా దువ్వాడ జగన్నాథం లో హీరోయిన్ ఆఫర్ శృతిహాసన్ దగ్గరికి వెళ్ళిందట.కానీ శృతి హాసన్ నో చెప్పడంతో ఇక చివరికి పూజా హెగ్డే నూ హీరోయిన్ గా ఈ సినిమాలో తీసుకున్నారట. ఒకవేళ శ్రుతిహాసన్ ఈ సినిమాకి నో చెప్పకపోయి ఉంటే పూజా హెగ్డే కెరియర్ ఎప్పటిలాగానే సాదాసీదాగా ఉండేదని స్టార్ హీరోయిన్ రేంజి సంపాదించడం కాస్త కష్టం అయ్యేది అన్న టాక్ ఉంది.