రెమ్యునరేషన్ పెంచేసిన దేవిశ్రీ.. ఎన్ని కోట్లో తెలుసా?
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం దేవిశ్రీ కొత్తగా నిరూపించుకోవాల్సినది ఏమీ లేదు అని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన ఆల్బమ్స్ అందించి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మెలోడీ అయినా ఐటమ్ సాంగ్ అయినా దేవి తనదైన శైలిలో కంపోజ్ చేస్తూ శ్రోతలను మెప్పిస్తూ ఉంటాడు. ఇక దేవిశ్రీ ఏదైనా సినిమాకి సంగీతం అందిస్తున్నాడు అంటే చాలు ఆ పాటలు సూపర్ హిట్ అవుతాయని ప్రేక్షకులు నమ్ముతుంటారు. ఇకపోతే ఇటీవల పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన పుష్ప సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించిన ప్రేక్షకులందరినీ మైమరిపింప చేస్తాడు దేవిశ్రీప్రసాద్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాకు కూడా ఛాన్స్ కొట్టేశాడు. ఇకపోతే ఇటీవలే పుష్ప సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందుకున్న దేవిశ్రీప్రసాద్ అటు పవన్ కళ్యాణ్ సినిమా కోసం మాత్రం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక్కో సినిమాకి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వాడట దేవిశ్రీప్రసాద్. కానీ ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం 5 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది లాంటి పవన్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు దేవిశ్రీ. దీంతో ఇప్పుడు వీరి కాంబినేషన్ అనేసరికి అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి.