టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ హీరోయిన్ ఐశ్వర్య ను పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?
ఐశ్వర్య తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్.. టక్కు జగదీష్.. భూమిక.. రిపబ్లిక్ వంటి చిత్రాలలో నటించినా.. ఒక్క సినిమా కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.. ఐశ్వర్య కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేయడం వల్లే ఈ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ కారణంగానే ఈమెకు సక్సెస్ రేటు పడిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఐశ్వర్యకు అవకాశాలు ఇవ్వడం లేదు..
ఐశ్వర్య రాజేష్ చేతిలో పెద్ద సినిమాలేవీ లేవు..ఇక తమిళంలో మాత్రం డ్రైవర్ జమున, మోహన్ దాస్ వంటి చిత్రాలను చేస్తోంది.. మరొకవైపు పులిమడ అనే మలయాళంలో సినిమాలో కూడా నటిస్తోంది.. ఇకపోతే ఏదైనా ఒక మ్యాజిక్ జరిగితే తప్ప ఈమెకు తెలుగులో అవకాశాలు రావనే చెప్పాలి.. కనీసం ఆ అదృష్టమైనా ఈమెకు దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.