సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు, పోతుంటారు, కానీ కొంత మంది మాత్రమే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలా పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు, అలా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న హీరోయిన్ లలో అలనాటి హీరోయిన్ కుష్బూ ఒకరు. కుష్బూ అలనాటి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది, ప్రస్తుతం కూడా కుష్బూ అనేక సినిమాల్లో నటిస్తూ ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ లో తన హవాను కొనసాగిస్తోంది.
ఇది ఇలా ఉంటే కుష్బూ తాజాగా శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది, ఈ మూవీ మార్చి 4 వ తేదీన విడుదల కాబోతుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కుష్బూ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడు రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది, ఎందుకంటే కేవలం ఆడవాళ్లకు అనే కాదు హ్యూమన్ ఎమోషన్స్‌కి ప్రాముఖ్యత ఇస్తూ దర్శకుడు ఈ కథను రాశాడు, ముఖ్యంగా ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. ఈ మూవీ లో కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు ఈ కాన్సెప్ట్ చాలా హిలేరియస్‌గా కూడా ఉంటుంది, ఆడవాళ్లు అంటే గ్లిజరిన్ తోనే పని ఉంటుంది అనుకుంటారు. ఈ సినిమాలో ఈ భావన తప్పు అని తెలుస్తుంది, వారు సంతోషంగా ఎందుకు ఉండకూడదు అనే కోణంలో డైరెక్టర్ ఈ కథను రాశారు అని ఖుష్బూ తెలియజేసింది. రాధిక , ఊర్శశి నా ఫేవరేట్ యాక్టర్స్, వాళ్లు చాలా గ్రేట్ యాక్టర్స్ , వారితో కలిసి వర్క్ చేయడం చాలా కష్టం అని కుష్బూ తెలియజేసింది. కథ నచ్చితే కొత్త వారితో కూడా మూవీ చేయడానికి సిద్ధమే అని కుష్బూ తెలియజేసింది.