కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఈ హీరో తమిళ నాట నటించిన దాదాపు ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటాడు, అలా విడుదల చేయడం మాత్రమే కాకుండా ఆ సినిమాలతో ఇప్పటి వరకు ఎన్నో విజయాలను కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య, మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఆ తర్వాత సూర్య హీరోగా తెరకెక్కిన 'సింగం' సిరీస్ సినిమాలు కూడా తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో కూడా సూర్య టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు, కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య తాజాగా ఈటి సినిమాలో హీరోగా నటించాడు, ఈ సినిమా కూడా తమిళ్ పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది, ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన అప్పటి నుండి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది, ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీ లో వినయ్ రాయ్, సూరి, సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు, ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఇమ్మన్ సంగీతం సమకూర్చగా సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు, ఎన్నో అంచనాలతో మార్చి 10 వ తేదిన విడుదల కాబోయే ఈ సినిమా థియేటర్ ల వద్ద ఏ రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.