బ్రేకప్ సమయంలో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లాను...బిందు మాధవి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ బిందు మాధవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ ఆవకాయ బిర్యాని, బంపర్ ఆఫర్,  రామ రామ కృష్ణ కృష్ణ, వంటి తెలుగు సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ  లో క్రేజ్ సంపాదించుకుంది,  అయితే ఆ తర్వాత కాలంలో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది,  కోలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు దక్కించుకున్న బిందు మాధవి అక్కడ కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే  ప్రస్తుతం బిందు మాధవి ఓటీటీ స్పెషల్ బిగ్ బాస్ లో ఆమె ఒక పార్టిసిపెంట్.  ఇది ఇలా ఉంటే తమ వ్యక్తిగత వివరాలను హౌస్ మేట్స్ తో పంచుకోవాలంటూ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ఆమె తన జీవితం లో జరిగిన ప్రేమ వ్యవహారం గురంచి చెప్పుకొచ్చింది, కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించానని, కానీ..  ఆ తర్వాత విడిపోయామని బిందు మాధవి  తెలిపింది.

అలాగే కెరీర్ కోసమే మేం దూరమయ్యాం అని బిందు మాధవి తెలియజేసింది, ఉన్నత చదువుల కోసం అతను అమెరికా వెళ్లాడు. నేను సినిమాల మీద ఇష్టం తో ఇక్కడే ఉండిపోయాను, అతనికి పెళ్లి కూడా అయిపోయింది. అతని తో ప్రేమ నాకు ఎప్పటికీ స్పెషల్ అని బిందు మాధవి చెప్పుకొచ్చింది,  అలాగే బ్రేకప్ సమయం లో తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని బిందు మాధవి తెలియజేసింది.  అలాంటి సమయం లోనే తమిళ బిగ్ బాస్ లో కంటెస్ట్ చేశానని, ఆ తర్వాత కొన్ని రోజులకే డిప్రెషన్ నుంచి బయటపడ్డానని బిందు మాధవి తెలియజేసింది, ఇప్పుడు తెలుగు లోనూ వచ్చిన అవకాశాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం వచ్చిందని అందాల ముద్దుగుమ్మ బిందు మాధవి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: