ఓకే హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న హీరోలు వీరే..!
రామ్ చరణ్ ... కియారా అద్వానీ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ 'వినయ విధేయ రామ' సినిమాలో హీరో , హీరోయిన్లుగా నటించారు, ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు , ప్రస్తుతం వీరిద్దరూ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో హీరో , హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
నాని ... కీర్తి సురేష్ : నాని , కీర్తి సురేష్ , త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన నేను లోకల్ సినిమాలో కలిసి నటించారు, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది, ప్రస్తుతం వీరిద్దరూ దసరా సినిమాలో కలిసి నటిస్తున్నారు.
చిరంజీవి ... కాజల్ అగర్వాల్ : మెగాస్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ 'ఖైదీ నెంబర్ 150' మూవీ లో హీరో , హీరోయిన్ లుగా నటించారు, ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది, ప్రస్తుతం వీరిద్దరూ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరో , హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గోపీచంద్ ... రాశి ఖన్నా : గోపీచంద్ రాశి ఖన్నా , రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన జిల్ మూవీ లో మొదటి సారి కలిసి నటించారు, ప్రస్తుతం వీరిద్దరూ మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మొవు లో మరో సారి కలిసి నటిస్తున్నారు.