అర్జున్ హీరోగా మధుబాల హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మేన్ సినిమా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1993 వ సంవత్సరం లో విడుదలైన జెంటిల్ మేన్ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర సాధించింది. జెంటిల్ మేన్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇలా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన జెంటిల్ మెన్ మూవీ కి సీక్వెల్ గా జెంటిల్ మేన్ 2 సినిమా రానుంది. జెంటిల్ మాన్ 2 సినిమాను నిర్మించనున్నట్లు ప్రొడ్యూసర్ కె. టి. కుంజుమోన్ 2020 వ సంవత్సరం లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ లో హీరోయిన్గా ఇటీవల మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి ని ఎంపిక చేశారు. తాజాగా ఈ మూవీ కోసం మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లు ప్రొడ్యూసర్ కె. టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా తెలియ జేసారు. జెంటిల్ మేన్ 2 సినిమా లో మరో హీరోయిన్ గా ప్రియాలాల్ నటించనుందని అధికారికంగా ప్రొడ్యూసర్ కె. టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదిక గా తెలియజేసారు తెలియజేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జెంటిల్ మేన్ 2 మూవీ లో హీరో ఎవరు అనేది వెల్లడి కాలేదు. జెంటిల్ మాన్ 2 మూవీ కి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించనున్నాడు. జెంటిల్ మాన్ 2 మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతోంది. జెంటిల్ మేన్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. మరి జెంటిల్ మేన్ 2 సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి.