మహిళా దర్శకురాలు అయిన సుధ కొంగరా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకురాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అందులో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకురాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ. కానీ తన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న మహిళా దర్శకురాలు సుధ కొంగరా. సూర్య హీరోగా తెరకెక్కిన సురారైపోట్రు సినిమాతో సుధ కొంగరా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదల అయ్యింది.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. సురారైపోట్రు ( ఆకాశమే నీ హద్దురా) సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ప్రముఖ 'ఓ టి టి' అమెజాన్ లో విడుదల అయింది. ఈ సినిమా 'ఓ టి టి' లో విడుదల అయినప్పటికీ ఈ సినిమా ఇటు ప్రేక్షకుల నుండి,వ అటు విమర్శకుల నుండి అదిరిపోయే ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాను దర్శకురాలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది.
ఇలా సురారైపోట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకురాలిగా క్రేజ్ ను సంపాదించుకున్న సుధ కొంగరా తాజా సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. సురారైపోట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సుధా కొంగరా తన తదుపరి చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కబోతుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే కొంగరా కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ లో హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు.