సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలలో కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రమే క్రేజీ హీరోయిన్ గా మరి వరుస సినిమా అవకాశాలను సినిమా ఇండస్ట్రీలో దక్కించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటారు. అలా క్రేజీ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ అవకాశాలు దక్కించుకుంటూ ఉండే హీరోయిన్ లలో కొంత మంది తమ అంద అందాలను ఆరబోసే గ్లామర్ పాత్రల్లో నటిస్తూ అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకొని ఆ పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించి, క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకు పోతూ ఉంటారు. అలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా ఆఫర్ లతో ముందుకు దూసుకుపోతున్న ముద్దుగుమ్మలో కీర్తి సురేష్ ఒకరు.
కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమా తో కీర్తి సురేష్ మంచి నటిగా తనను తాను నిరూపించుకుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ... కెరియర్ ప్రారంభం నుంచి కూడా నేను నటన పైనే దృష్టి పెట్టాను. అదృష్టం కొద్దీ అలాంటి క్యారెక్ట లే వచ్చాయి. అలాగే కీర్తి సురేష్ తెరపై గ్లామరస్ గా కనిపించే విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోను నేను ఆ పరిమితులను దాటను అని తెలియజేసింది.