సచిన్ కూతురు సారా టెండూల్కర్ హీరోయిన్ కానుందా ?
అయితే ఆమె కూడా నిత్యం సోషల్ మీడియాలో తన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తుంటుంది. అంతేకాదు ఇటీవలే మోడల్‌గా 24 ఏళ్లకే తన కెరీర్ ప్రారంభించిన సారా.. అటు పలు యాడ్స్‌లో కూడా నటించి అనేక ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇదే అదునుగా బాలీవుడ్లో ఎంట్రీ కోసం తాను యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటోందని సినీ వర్గాల్లో ఫుల్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే సారాను తమ సినిమాల ద్వారా పరిచయం చేయించాలని ఎంతో ఆసక్తి గా ఫిల్మ్ మేకర్స్ తమ విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్.
కాగా ఇంతక ముందు ఒక సారి షాహిద్ కపూర్ సినిమాలో హీరోయిన్గా సారా నటిస్తోందన్న రూమర్స్ చాలానే వినిపించినప్పటికీ.. అది ఒక ఫేక్ న్యూస్‌గా సచిన్ కొట్టిపారేసాడు . అంతేకాదు సారా తన స్టడీస్‌పై కాన్సంట్రేట్ చేస్తోంది అని కూడా క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ న్యూస్‌పై సచిన్ ఎలా స్పందిస్తాడా అని తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇటీవలే సారా లండన్ యూనివర్సిటీ నుంచి తన మెడిసిన్‌లో పట్టాపొందింది. మరి ఇలాంటి సమాయంలో సారా అసలు సినిమాలలో నటించనున్నదా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.