బిగ్ బాస్ ఫెమ్ అషు రెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అషు రెడ్డి , నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక టీవీ షో లలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకొని అనేక టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అషు రెడ్డి ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' లో పార్టిసిపెట్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫోకస్ మూవీ లోని అషు రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ ను బి. సుమతి ఐపీఎస్ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుదల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సినిమాలో విజయ శంకర్ హీరోగా నటించగా అషు రెడ్డి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ మూవీ కి జి. సూర్య తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫోకస్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో బిగ్ బాస్ ఫెమ్ అషు రెడ్డి మొదటి సారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. తాజాగా విడుదల చేసిన ఫోకస్ మూవీ లోని అషు రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫోకస్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.