ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీకి కొంత మంది మోడలింగ్ రంగం నుండి వస్తూ ఉంటే, మరి కొంత మంది సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకొని వస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత బుల్లి తెరపై అవకాశాలు దక్కించుకొని, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ తమ సత్తా చాటుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించి, ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలో దేత్తడి హారిక ఒకరు. దేత్తడి హారిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ విదేవుల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకున్న హారిక 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటకు వచ్చాక పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. హారిక అందులో భాగంగా నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన వరుడు కావలెను సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా యూట్యూబ్ వీడియోలతో, బుల్లితెర ద్వారా , సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న హారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షోతో కుఫైన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో హారిక పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా హారిక తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హారిక స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. హారిక కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ , గార్జియస్ , ఫైర్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.