"క్రిమినల్" మూవీపై నాగార్జున ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా?
అసలు ఈ సినిమా వెనక ఎంత గ్రౌండ్ వర్క్ జరిగింది అంటే.....ఫెయిల్ అవుతుందని అస్సలు ఎవరు ఊహించలేదు, నాగార్జున కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్సపెక్ట్ చేశారట. నిజానికి క్రిమినల్ స్టోరీ ఏమి ప్రయోగం కాదు... ఇదో హాలీవుడ్ మూవీ నుండి తీసుకున్న లైన్ అని సమాచారం. అందులోనూ హాలీవుడ్ లో ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. దాంతో కథపై ఫుల్ కాన్ఫిడెంట్, ఇక హీరో నాగార్జున వరుస విజయాలతో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయం అది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రమ్య కృష్ణ, మనీషా కొయిరాలా ఇద్దరు అప్పట్లో బిజీ స్టార్ హీరోయిన్లే, ఇక దర్శకుడు మహేష్ భట్ వైవిద్య భరిత చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట.
ఇక సంగీతం విషయానికి వస్తే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అలాంటిది ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండి కూడా ఎందుకనో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. విమర్శకుల ప్రశంసలు అయితే సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇలా నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా బొక్కబోర్లా పడేలా చేసింది.