'అశోకవనంలో అర్జున కళ్యాణం' మూవీ 'ఓటిటి' స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అంటే..!

frame 'అశోకవనంలో అర్జున కళ్యాణం' మూవీ 'ఓటిటి' స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అంటే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ , రుక్షర్ ఢిల్హాన్ హీరో , హీరోయిన్ లుగా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నిన్న అనగా మే 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు విద్యాసాగర్ దర్శకత్వం వహించగా,  సుదీర్ బాపినీడు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు,  టీజర్ ,  ట్రైలర్ లు  ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షలులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర విడుదలైన మొదటి షో  నుండే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇది వరకు విశ్వక్ సేన్ తాను నటించిన సినిమాలలో మాస్ లుక్ లో కనిపించే ప్రేక్షకులను అలరించాడు. అశోక వనంలో అర్జున కల్యాణం మూవీ లో విశ్వక్ సేన్ క్లాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్  33 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా పెళ్లి కానీ అబ్బాయి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.  

తాజాగా థియేటర్ లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా 'ఓ టి టి'  అప్డేట్ కు సంబంధించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ఈ సినిమా  'ఓ టి టి' హక్కులను తెలుగు ప్రముఖ 'ఓ టి టి' సంస్థ  ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా విడుదల అయిన నెల రోజుల తర్వాత అనగా జూన్ మొదటి వారం నుండి అశోకవనంలో అర్చన కళ్యాణం మూవీ ఆహా  'ఓ టి టి'  లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనునట్లు సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: