అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లో కథానాయికగా నటించింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో సర్కారు వారి పాట చిత్ర బృందం ఈ మూవీ ప్రమోషన్ స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా తాజాగా సర్కారు వారి పాట చిత్ర బృందం చాలా గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో కీర్తి సురేష్ అందరి మనసులను దోచుకుంది.
అది ఎలా అంటారా... కీర్తి సురేష్ తన స్పీచ్ తో పాటు తన అదిరిపోయే అందచందాలతో కూడా ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కీర్తి సురేష్ 'సర్కారు వారి పాట' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చమ్కీలు పొదిగిన సారీ తట్టుకొని , అందుకు తగిన చమ్కీలు పొదిగిన బ్లౌస్ ను ధరించి వచ్చింది. ఈ డ్రెస్ లో కీర్తి సురేష్ పెరిగిపోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది ని తన అందచందాలతో ఫిదా చేసింది. ఇలా కీర్తి సురేష్ 'సర్కార్ వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.