వర్మ మామూలోడు కాదు : పూజ భలేకర్..!!
అవును.. ఎంత మసాలా దట్టించినప్పటికీ కూడా వర్మ సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించలేకపోతున్నాయి. ఇకపోతే వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉంటాడు. నిత్యం ఏదోఒక రచ్చ చేస్తూనే ఉంటాడు ఆయన. ఇక సినిమాలు విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తిన వర్మ తన పంథాని మాత్రం అస్సలు మార్చడం లేదు. ఈ క్రమంలో ముసలి వర్మ పని అయిపోయిందని చాలామంది నెటిజన్లుకూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సంగతి మనకు బాగా తెలిసిందే. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ తో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. వాటికి పెడుతున్న కామెంట్స్ చూస్తూ ఉంటే బాబోయ్ వర్మ నువ్వు మామ్మూలోడివి కాదు బాబోయ్ అనాల్సిందే.
తాజాగా ఆయన తెరకెక్కించిన ‘లడ్కీ’ సినిమా హీరోయిన్ ‘పూజా భలేకర్’ ఒక వీడియోను సోషల్ మీడియాలో అందరికి షేర్ చేసింది. ఆ వీడియోలో బికినీతో పూజా భలేకర్ మతులు పోగొట్టే విధంగా ఉందట.. ఆ వీడియోకు పూజా ‘నన్ను నేను ఎలా ట్రీట్ చేసుకుంటానో మీరు అలాగే ట్రీట్ చేయండి’ అని కామెంట్ కూడా పెట్టింది. అందుకు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందిస్తూ, నిన్ను ఎలా ట్రీట్ చేయాలి? ఐస్ క్రీమ్ లాగానా అంటూ ప్రశ్నించాడట.. అందుకు పూజా భలేకర్ స్పందిస్తూ… నన్ను ఎంతో ప్రేమతో ట్రీట్ చేయాలి.. ఈ వేసవిలో ఐస్ క్రీమ్ అనే సౌండ్ వినడానికి చాలా అహ్లాదకరంగా ఉందంటూ కూడా ఆమె పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన కామెంట్స్ చూసి వర్మ స్వీట్స్ భలే తినిపిస్తాడే అని కామెంట్లు కూడా చేస్తున్నారు.