"ఐటెం సాంగ్" లకు అంత సీన్ ఎందుకు ?
ఈ సాంగ్ లతో పారితోషకానికి పారితోషకం క్రేజ్ కి క్రేజ్ దక్కుతుండటంతో స్టార్ హీరోయిన్ లు సైతం ఐటెం సాంగ్స్ అంటే సై అంటున్నారు. రంగస్థలం లో జిల్ జిగెలు రాణి అంటూ పూజ హెగ్డే, జనతా గ్యారేజ్ చిత్రంలో నేను పక్కా లోకల్ పక్కా లోకల్ అంటూ కాజల్ అగర్వాల్ , జై లవకుశ చిత్రంలో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ తమన్నా భాటియా లు స్పెషల్ సాంగ్స్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. అవి ఆ సినిమాలకు ఎంతో ప్రత్యేకంగా నిలబడ్డాయి. స్టార్ హీరోలకు మించి ఐటెం సాంగ్స్ తో పాపులారిటీ ని పెంచుకుంటున్నారు హీరోయిన్లు. సినిమాలో స్పెషల్ సాంగ్స్ ఉంటే ఆ కిక్కే వేరు. ఐటెం సాంగ్స్ లో స్టార్ హీరోయిన్లు ఉంటే వచ్చే రెస్పాన్స్ వేరే రేంజ్ లో ఉంటుండటం తో నిర్మాతలు సైతం వారు అడిగినంత ఇచ్చేస్తూ షురూ చేస్తున్నారు.
కొన్ని సినిమాల్లో అయితే ఆ చిత్రం లో హీరోయిన్ల కంటే స్పెషల్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్లే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే వీరి క్రేజ్ ఏ స్థాయిలో ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పాలా. స్టార్ హీరో సినిమా అయిన యంగ్ హీరో సినిమా అయినా వారి సినిమా వస్తుంది అంటే స్పెషల్ సాంగ్ వుందా? అందులో తమ అభిమాన హీరోతో ఊరమాసు స్టెప్పులు వేసే హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇపుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ హవా నడుస్తోంది.