ప్రభాస్ హీరోయిన్ సీమంతం ఫోటోలు వైరల్..!!

Divya
గడిచిన రెండు దశాబ్దాల క్రితం సొంతం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది హీరోయిన్ నమిత. ఆ తరువాత ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణులు పెళ్లి.. సింహ , బిల్లా, జెమిని వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. సినిమా కెరియర్ లో ఎక్కువ గ్లామర్ పాత్రలే పోషించిన నమిత తెలుగులో పాటు తమిళ కన్నడ మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత తమిళ బిగ్బాస్ సీజన్ వన్ లో పాల్గొని బుల్లితెర పైన బాగానే అలరించింది.
ఇక 2017వ సంవత్సరంలో వ్యాపారవేత్త వీరేంద్ర ను వివాహం చేసుకుంది నమిత. తిరుపతిలో వీరి వివాహం చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈ క్రమంలోనే తమ దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే ఒక పండంటి బిడ్డ పుట్ట పోతోందని తాను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది అందాల ముద్దుగుమ్మ నమిత. ఇక అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన మాతృత్వాన్ని చాటుకుంటూ వస్తోంది ఇటీవల అందుకు సంబంధించి ఫోటో షూట్ కూడా జరిగింది.
తాజాగా నమిత సీమంతం ఫోటోలు కూడా నెట్లో చాలా వైరల్ గా మారుతున్నాయి. కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుకలు చాలా అంగరంగవైభవంగా జరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ సెలబ్రేషన్స్లో చీరకట్టుతో ఎంతో అందంగా కనిపిస్తున్నది నమిత. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త ట్రెండీగా నిలుస్తున్నాయి. సినీ సెలబ్రిటీలు అభిమానులు సైతం.. నమిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నమిత వయస్సు 41 సంవత్సరాలు కావడంతో ఈ వయసులో తల్లి కావడం గమనార్హం అని చెప్పవచ్చు. ఇక అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: