నయన్ - విగ్నేష్ ల మధ్య ప్రేమ ఎలా మొదలైందో తెలుసా..?

Anilkumar
మరికొన్ని గంటల్లో విఘ్నేష్ శివన్ మరియు అందాల భామ నయనతారల పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. అయితే నయనతార హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలైంది.ఆమె 20 ఏళ్ల సినీ కెరీర్ లో నయనతార ఎన్నో సంచలన విజయాలను సాధించారు.ఇదిలావుండగా  ఒకవైపు గ్లామరస్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల ద్వారా నయనతార మెప్పించారు. ఇకపోతే దర్శకుడిగా విఘ్నేష్ శివన్ ఖాతాలో పలు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.నయనతార, విఘ్నేష్ ల మధ్య ప్రేమ మొదలుకావడానికి నేనూ రౌడీనే సినిమా కారణం .

ఇక  ఈ సినిమా కోసం కలిసిన సమయంలోనే అటు నయనతారకు ఇటు విఘ్నేష్ శివన్ కు ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం కలిగింది. నంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార విఘ్నేష్ ల ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.కాగా ఈ ఫోటోల గురించి స్పందించడానికి అటు నయనతార కానీ ఇటు విఘ్నేష్ శివన్ కానీ ఇష్టపడలేదు.అయితే నేనూ రౌడీనే సినిమా ఈవెంట్లలో నయన్, విఘ్నేష్ గంటలతరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే 2017 సంవత్సరంలో అవార్డుల ఫంక్షన్ లో నయన్, విఘ్నేష్ జంటగా కనిపించడంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఇకపోతే  నయనతార మంచి నటి మాత్రమే కాదని మంచి మనస్సు ఉన్న మనిషి అని విఘ్నేష్ శివన్ మరో సందర్భంలో చెప్పుకొచ్చారు.అంతేకాదు విఘ్నేష్ శివన్ నయన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. అయితే 2021 సంవత్సరం మార్చి నెల 25వ తేదీన నయన్, విఘ్నేష్ లకు నిశ్చితార్థం జరిగింది.కాగా  నయన్ విఘ్నేష్ పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా రేపు ఉదయం నయన్ విఘ్నేష్ వివాహం జరగనుంది.ఇక  తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, సమంతలకు నయన్ విఘ్నేష్ ల పెళ్లికి ఆహ్వానం అందిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: