దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఇప్పటివరకు ఎన్నో అరుదైన రికార్డ్ లను సృష్టించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని దాదాపు 1,100 కోట్ల కు పైగా కలెక్షన్లను కొల్లగొట్టే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత 'ఓ టి టి' లో కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఇలా ఉంటే తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ మరో ఘనమైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
అసలు విషయం లోకి వెళితే... యుఎస్ఎలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఘనమైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. యూఎస్ఏ లో అతి పెద్ద పబ్లిషన్స్ అయినటువంటి టుడే వారు ఈ సంవత్సరం విడుదల అయ్యిన అన్ని మూవీ లలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని నెంబర్ 1 స్థానంలో ప్రచురించారు. ఈ లిస్ట్ లో పలు హాలీవుడ్ భారీ మూవీ లు కూడా ఉన్నాయి. కానీ ఆ సినిమాలలో మించి 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని నెంబర్ 1 మూవీ గా వారు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్ , శ్రేయ, సముద్ర కని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.