టాప్ గన్ : రికార్డు వసూళ్లు కొల్లగొట్టిన టామ్ క్రూజ్!

Purushottham Vinay
ఇక కరోనా క్రైసిస్ తర్వాత హాలీవుడ్ లో అతిపెద్ద సంచలనం ఇది. టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావెరిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక బిలియన్ అమెరికా డాలర్లను అధిగమించింది.ఇక టాప్ గన్- టామ్ క్రూజ్ కి మొదటి బిలియన్ డాలర్ క్లబ్ మూవీగా రికార్డును నెలకొల్పింది.టామ్ క్రూజ్ తన 40 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో ఇంత గొప్ప పురోగతిని చూడటం ఇదే మొదటిసారి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. జెట్ ఇంజిన్ లు యుద్ధవిమానాలతో ప్రయోగాలు చేయడానికి ఆసక్తిగా ఉండే టామ్ క్రూజ్ ఫార్ములా ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.తన ఇన్నేళ్ళ కెరీర్ లో ఆ మైలురాయిని అందుకోవడం టామ్ కి ఇదే తొలిసారి. దీనికి ముందు 2018 వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 791 మిలియన్ల అమెరికా డాలర్లను వసూలు చేసిన `మిషన్: ఇంపాజిబుల్ - ఫాల్ అవుట్` సినిమా టామ్ క్రూజ్ కి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.మావెరిక్ {{RelevantDataTitle}}