'చార్లీ' తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక మందన్న లవర్ !
ఈ మూవీ రిలీజ్ అయ్యి మూడు వారలు గడుస్తున్నా బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్తో ఇప్పటికీ అదే స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన, విలక్షణాత్మకమైన నటనతో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ శెట్టి. క్రిటిక్స్ సైతం ఈ సినిమాకి ఫుల్ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రక్షిత్ శెట్టి మరియు చార్లీ కి మధ్యన సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న బడ్జెట్ సినిమాలలో ఉత్తమ చిత్రంగా అందరూ దీనికి మెచ్చుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల విషయానికి వస్తే... ఇరు తెలుగు రాష్ట్రాల్లో 2.09 కోట్లు కు పైగా వసూలు చేసింది. 19 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం : 63L
సీడెడ్ : 21L
ఆంధ్రప్రదేశ్ : 40L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ :2.09కోట్లు అదే విధంగా టోటల్ (1.82కోట్ల గ్రాస్) గా ఉన్నట్లు తెలుస్తోంది.