పెళ్ళా.. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు : హిమజా
ఒకవైపు నటన పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇక ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను యూట్యూబ్ వేదికగా పెంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అనే ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించింది.ఇందులో భాగంగా ఎక్కువ మంది హిమజా పెళ్లి గురించి అడిగారు.. ఈ క్రమంలోనే ఇటీవల తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ అమ్మడు.
ప్రస్తుతం తనకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని వాస్తవానికి అయితే అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకు పీస్ ఆఫ్ మైండ్ ఫ్రీడం కావాలని చెప్పుకొచ్చింది బిగ్ బాస్ హిమజా. దీంతో హిమజ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతున్నాయ్ అని చెప్పాలి. ప్రస్తుతం పెళ్లికి దూరంగా తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న హిమజా పెళ్లి తర్వాత అలాంటి స్వేచ్ఛకు దూరం అవుతానని భావిస్తున్నట్లు ఆమె మాటల్లో తెలుస్తుంది. దీంతో హిమజా పెళ్లి చేసుకోను అని చెప్పడంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు.