బాలీవుడ్ స్టార్ హీరో కి పోటీగా హీరో విజయ్ సేతుపతి..!!
కేవలం 25 నుంచి 30 రోజుల డేట్లు మాత్రమే విజయ్ సేతుపతి మైత్రి మూవీస్ వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరో పొజిషన్లో ఉన్న షారుఖ్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో వస్తున్న జవాన్ చిత్రంలో విజయ్ సేతుపతి నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జవాన్ చిత్రంలో విజయ్ సేతుపతి అత్యంత క్రూరడైన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం.
విజయ్ మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు. ఇలాంటి స్టైల్ లోనే జవాన్ చిత్రంలో చూపించబోతున్నారు అనే వార్త వినిపిస్తున్నది. ఇక డైరెక్టర్ అట్లీ కాబట్టి ఈ సినిమా కాస్త ఫక్త్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి విజయ్ సేతుపతి ఎంటర్ ఇస్తుందని నమ్మకంతో అభిమానుల సైతం ఉన్నారు. పుష్ప మరియు జవాన్ చిత్రాల విజయ్ సేతుపతి నిజంగానే నటిస్తున్నట్లు అయితే ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా స్టార్డమ్ పెరిగిపోతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ లో పేరు వినిపిస్తుందని అభిమానులు ఆనందంలో ఉన్నారు. మరి ఈ రెండు చిత్రాలతో విజయ్ సేతుపతి ఎలా స్పందిస్తారో చూడాలి.