మాసివ్ మార్క్ ని టచ్ చేసిన 'అరబిక్ కుత్తు' సాంగ్..!
మొదటి నుండి సినీ ప్రేమికులు మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు భారీ రేంజ్ లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కినప్పటికీ, ఈ మూవీ కి బాక్సాఫీస్ దగ్గర మొదటి షో కే నెగటివ్ టాక్ రావడంతో మొదటి రోజు తర్వాత ఈ మూవీ కి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. చివరగా బీస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా బీస్ట్ మూవీ పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ ఈ సినిమా లోని అరబిక్ కుత్తు పాట మాత్రం రోజుకో రికార్డ్ ను సృష్టిస్తూ ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతోంది.
అందులో భాగంగా తాజాగా అరబిక్ కుత్తు పాట ఓ రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ను సాధించింది. మొదటగా ఈ మూవీ నుండి విడుదల అయిన అరబిక్ కుత్తు లిరికల్ సాంగ్ రికార్డ్ స్థాయి వ్యూస్ ని సాధించగా , ఆ తర్వాత ఈ మూవీ నుండి విడుదల అయిన అరబిక్ కుత్తు వీడియో సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో యూట్యూబ్ లో వ్యూస్ ని సాధిస్తోంది. బీస్ట్ మూవీ కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ ని అందించాడు.