అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి కన్నా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.
తెలుగులో మాత్రమే కాకుండా రాశి కన్నా ప్రస్తుతం తమిళ , బాలీవుడ్ సినిమాల్లో కూడా తన హవా ను చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తమిళంలో అరణ్మయి 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది. రాశి కన్నా బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ సరసన రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన రాశి కన్నా 'సర్దార్' మూవీ లో హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో రాశి ఖన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రాశి కన్నా తెలుగు లో నటించిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించగా మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రకటించబడుతుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా రాశి కన్నా కు ... మీరు చేసిన సినిమాల్లో మీకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు రాశి కన్నా 'ఊహలు గుసగుసలాడే' మూవీ లోని ప్రభావతి క్యారెక్టర్ , అలాగే తొలిప్రేమ సినిమా లోని వర్ష పాత్ర నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది అని సమాధానం ఇచ్చింది. ఇది ఇలా ఉంటే తెలుగులో రాశి కన్నా నటించిన థాంక్యు సినిమా జూలై 22 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించగా , విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.