కిరణ్ అబ్బవరం లైఫ్ కు ఇదే కీలకం ?
ఇప్పుడు ఇతని ఖాతాలో మరో రెండు సినిమాలో షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో ఒకటి "నేను మీకు బాగా కావలసిన వాడిని"... ఈ సినిమా ద్వారా మరో కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాను ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం ఒక కార్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. కిరణ్ సరసన సంజనా ఆనంద్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నిన్న రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే ఎప్పటిలాగే టీజర్ లో యూత్ ను ఆకట్టుకునే డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు, మరి సినిమాలో అసలు విషయం ఉంటుందా ? లేదా పాత సినిమాల లాగే ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.
ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కిరణ్ కు మామయ్యగా నటించనున్నాడు. ఇందులో తన పాత్ర హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అవడం తనకు చాలా ముఖ్యం అని చెప్పాలి. లేదంటే చాల మందిలాగే ఇతను కూడా కనుమరుగైపోక తప్పదు.