శివాత్మిక అందానికి ఫిదా అవుతున్న నెటిజన్స్..!!
శివాత్మిక రాజశేఖర్.. యాంగ్రీ మాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ శివాత్మిక రాజశేఖర్ కు మాత్రం నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే వరుస సినిమాలలో నటించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా శివాత్మిక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది.
ఇకపోతే ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక నెటిజన్ మాత్రం శివాత్మిక రాజశేఖర్ ఫోటోలు చూసి మేడం మీరు అచ్చం దేవతలా ఉన్నారు అంటూ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఆ పిక్స్ కాస్తా బాగా వైరల్ అవుతున్నాయి. కాస్త ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ లీడ్‌రోల్ పోషిస్తున్న రంగమార్థాండ సినిమాలో నటిస్తోంది.