హీరోల సమస్యలతో చిరంజీవి ?

Seetha Sailaja
మెగా స్టార్ చిరంజీవి దక్షిణ భారతదేశ చలన చిత్రరంగం గర్వంగా చెప్పుకునే హీరో. చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అని అనేకమంది అనుకునే పరిస్థితులలో చిరంజీవికి హీరోల సమస్య ఏర్పడటం అత్యంత షాకింగ్ గా మారింది. గత కొంతకాలంగా చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలోను మరొక హీరో ఉండే విధంగా చూసుకుంటున్నాడు.

‘ఆచార్య’ మూవీలో చిరంజీవి పక్కన రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. ఇక దసరా కు విడుదలకాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి పట్టుపట్టి సల్మాన్ ఖాన్ తో అతిధి పాత్ర చేయించాడు. అదేవిధంగా సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘వాల్టేర్ వీరయ్య’ మూవీలో చిరంజీవితో సమానమైన పాత్రలో రవితేజా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ లిస్టులో ‘భోళాశంకర్’ మూవీ కూడ చేరిపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించిన కథ రీత్యా మరొక హీరో కావాలి. అయితే ఇప్పుడు ఆ హీరో గురించే అన్వేషణ్ కొనసాగుతున్నట్లు టాక్. హీరో నితిన్ ను ఈవిషయమై సంప్రదిస్తే అతడు ఈ మూవీ ప్రాజెక్ట్ లో నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచలేదని తెలుస్తోంది. మెగా మేనల్లుళ్ళు సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లు చిరంజీవి పక్కన నటించడానికి ఎందుకనో చిరంజీవి ఈవిషయంలో వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో లేడు అన్న సంకేతాలు వస్తున్నాయి.

దీనితో ‘భోళా శంకర్’ మూవీలో చిరంజీవి పక్కన నటించబోయే ఆ మిడిల్ రేంజ్ హీరో ఎవరు అన్న చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ విషయంలో వెనక పడటానికి గల కారణం చిరంజీవి పక్కన నటించే హీరో ఫైనల్ కాకపోవడమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి లాంటి మెగా హీరో సినిమాకు కూడ ఈ సెకండ్ హీరో కష్టాలు ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్య పడుతున్నారు. ‘ఆచార్య’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో చిరంజీవి తాను నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: