త్రివిక్రమ్ సినిమాల్లో.. ఆ సీన్ ఖచ్చితంగా ఉంటుంది.. గమనించారా?
జులాయి : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జులాయి సినిమాలో విలన్ సోను సూద్ తమ్ముడు చనిపోవడంతో కథ కీలక మలుపు తిరుగుతోంది.
సన్నాఫ్ సత్యమూర్తి : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి చనిపోవడం కారణంగా ఇక కథ మలుపు తిరుగుతుంది అని చెప్పాలి.
అత్తారింటికి దారేది : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లి గన్ షూట్ లో చనిపోతుంది. అప్పటి నుంచి కథ మలుపు తిరుగుతుంది అని చెప్పాలి.
అ ఆ : నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలోని తన తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది.
అరవింద సమేత :: ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి గా నటించిన నాగబాబు చనిపోతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది.
అజ్ఞాత వాసి : పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి చనిపోయిన తర్వాత కథలో కీలక మలుపు చూడవచ్చు.
ఖలేజా : మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఒక డాక్టర్ చనిపోయి మహేష్ బాబు కార్ మీద పడటంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అంతకు ముందు వచ్చిన అతడు సినిమాలో పార్థు పాత్ర చనిపోవడం కారణంగా కథ మలుపు తిరుగుతుంది. ఇక అలా వైకుంఠపురం సినిమాలో కూడా ఒక నర్స్ చనిపోవడంతో అక్కడి నుంచి కథ మలుపు తిరిగి రసవత్తరంగా మారుతోంది.