విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా వచ్చి ఒక్క రోజే అయ్యింది.ఇక ఈ రోజు వచ్చి టాక్‌లో ఎక్కడ కూడా ఒక్కపైగా హిట్, మంచి వసూళ్లు వస్తాయి అనే నమ్మకం కనిపించడం లేదు. పోతే యునానిమస్‌గా ఈ సినిమా ఫట్ అంటూ సోషల్ మీడియాలో, సినిమా జనాల్లో మాటలు వినిపిస్తున్నాయి.అంతేకాదు పెట్టింది రావడం కూడా కష్టమే.అయితే విజయ్ కోసం జనాలు సినిమాకు వెళ్తే కాస్త డబులు వస్తాయి అని చెబుతున్నారు.ఇక దీంతో సినిమా ప్రచారంలో భాగంగా ఛార్మి చెప్పిన ఓ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే సినిమా కోసం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ను ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.
పోతే అందులో 'లైగర్'కి ఓ ఓటీటీ నుండి రూ. 200 కోట్ల ఆఫర్ వచ్చిందని.. అయినా ఒప్పుకోలేదని ఘనంగా చెప్పుకొచ్చింది ఛార్మి.ఇక అంతేకాదు తాము ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం విజయ్ దేవరకొండ మీద నమ్మకం అని చెప్పింది.అంతేకాదు దాంతోపాటు సినిమా కథాంశం మీద ఉన్న నమ్మకం కూడా అని చెప్పింది.అయితే తీరా సినిమా ఇప్పుడు చూస్తే.. మొత్తంగా పరిస్థితి మారిపోయింది. ఇక ఏ మూల నుండి కూడా ఒక్క పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. అయితే ఎటు చూసినా సినిమా ఫలితం తేడా కొట్టింది అనే మాటే వినిపిస్తోంది. పోతే విజయ్ బాగానే చేసినా.. పూరి జగన్నాథ్ దెబ్బకొట్టారు అని అంటున్నారు. కాగా కథ, కథనం, టేకింగ్, కాస్టింగ్.. ఇలా అన్నింటా విఫలమయ్యారు అని అంటున్నారు.
అయితే ఈ లెక్కన పూరి జగన్నాథ్ మీద ఛార్మి పెట్టుకున్న నమ్మకం (అతి నమ్మకం) పెద్ద దెబ్బే కొట్టింది అని చెప్పాలి. కాగా ఓటీటీ డీల్‌కి ఓకే అనేసుంటే రూ. 200 కోట్లు వచ్చేవి.విజయ్ అయితే సినిమా వసూళ్లు రూ. 200 కోట్ల నుండి లెక్కెడతా అని సినిమాకు ఓవర్ హైప్ ఇచ్చాడు. రూ. 200 కోట్లకుపైగా సినిమా వసూళ్లు ఉంటాయి అని చెప్పాడు. ఇక దీంతో వాళ్ల మాటలే వారిని ఇబ్బంది పెట్టాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆఖరిగా అతి నమ్మకం పనికిరాదు. అంతేకాదు అతి ఆశ కూడా పనికిరాదు. సినిమాల్లో ఇది మరీనూ.ఇక దీని నష్టం 'లైగర్' టీమ్‌కి రూ. 200 కోట్లు. అయితే ఈ మాట మేం అనడం లేదు..!!