ఎన్టీఆర్ టాలెంట్ తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..?
ఈ సినిమా కోసం రాజమౌళి కూడా చాలానే కష్టపడ్డాడు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని తన సినిమా స్థాయిలో బ్రహ్మాస్త్ర సినిమాని ప్రమోషన్స్ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది... రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ యొక్క జ్ఞాపకశక్తి గురించి.. ఎన్టీఆర్ కు ఏది ఇష్టమైతే దాన్ని ఎంతగా గుర్తు పెట్టుకుంటాడు అనే విషయానికి ఇదే సాక్ష్యం అని తెలిపారు.
RRR సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఉన్న సమయంలో రణబీర్ కపూర్ ను మేం కలవడం జరిగింది. ఆ సమయంలో రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ పాటలను ఎన్టీఆర్ ప్లే చేయాల్సిందిగా ఆయనని అడిగారు.అప్పుడు రణబీర్ ఆ పాటలను ప్లే చేయించారు.. అయితే రాక్ స్టార్ చిత్రంలో నటించిన రణబీర్ కపూర్ ఆ పాటల యొక్క లిరిక్స్ ను మర్చిపోయి ఉంటారేమో కానీ ఎన్టీఆర్ మాత్రం లైన్ టు లైన్ పాడి అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచారని తెలియజేశారు రాజమౌళి. ఎన్టీఆర్ కు నచ్చితే దాన్ని ఆయన ఎంతలా గుర్తు పెట్టుకుంటాడు అనే విషయం విన్న అభిమానులు సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక ఈ విషయం రాజమౌళి చెప్పడంతో మరింత పాపులర్ గా మారుతోంది.