తన సీక్రెట్స్ రివీల్ చేసిన... షాకింగ్ బ్యూటీ.....!!

murali krishna
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లు చూడడానికి ఎంతో అందంగా నేచురల్ లుక్ తో కనిపిస్తూ ఉంటారు. ముఖంపై ఎటువంటి పింపుల్స్ లేకుండా, మేకప్ లేకపోయినా కూడా అందంగా కనిపిస్తూ ఉంటారు.
ఇంకొందరు హీరోయిన్లు ముఖంపై పింపుల్స్ ని మేకప్ తో కవర్ చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ అంతా అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం తాజాగా బ్యూటీ టిప్స్ చెప్పుకొచ్చింది హీరోయిన్ తారా సుతారియా. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమాతో బాలీవుడ్‌ కీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే తన అందం,నటనతో యువతని ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈమె అందానికి ఈ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అరంగేట్రం లోనే తన అందంతో యువతను ఫిదా చేసింది తారా సుతారియా. ఇది కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక మర్జావన్‌, తడప్‌, ఏక్‌ విలన్‌ రిటర్న్స్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈమె అందం రహస్యం గురించి తెలుసుకోవాలని అభిమానులు కుతూహలంగా ఉంటారు. అయితే తాజాగా తన అందం యొక్క రహస్యాలను చెప్పుకొచ్చింది తారా సుతారియా.
  తన మెరిసే మేనికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటోంది. ముఖం చంద్రబింబంలా మెరవాలంటే తాను చెప్పే టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది అని అంటుంది ఈ బ్యూటీ. నా బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు. అలాగే అమ్మ నేర్పిన హోం మేడ్ ఫేస్ ప్యాక్. పెరుగులో, తేనె శనగపిండి,కాస్త పసుపు కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసి అది డ్రై అయిన తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మొహంలోని అలసట మాయమైపోయి ముఖంలో గ్లో వచ్చేస్తుంది అని చెప్పుకొచ్చింది తారా సుతారియా. అయితే ఈ హోం మేడ్ చిట్కా మా అమ్మమ్మది. ఆమె ఫాలో అయ్యింది. ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను..నా అందం వెనుక ఉన్న రహస్యం ఇదే అని తెలిపింది తారా సుతారియా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: