కీర్తి సురేష్ కూడా మొదలుపెట్టింది గా!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో గ్లామర్ షో ఎక్కువగా చేసే హీరోయిన్ లకే అవకాశాలు మెండుగా వస్తూ ఉంటాయి. అలా తెలుగు సినిమా పరిశ్రమ లాంటి కమర్షియల్ చిత్ర పరిశ్రమలో గ్లామర్ షో చేసే హీరోయిన్లకే ఇప్పటివరకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. ప్రేక్షకులు కూడా అలాంటి హీరోయిన్ల ను కోరుకోవడంతో నిర్మాతలు సైతం వారిని ఎంపిక చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు.

ఆ విధంగా ఇప్పటివరకు చాలామంది గ్లామర్ హీరోయిన్లు అగ్ర హీరోయిన్ లు గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో స్థిరపడి పోగా తాజాగా మరొక హీరోయిన్ గ్లామర్ షో వైపు అడుగులు వేస్తూ వరుస సినిమా అవకాశాలు అందుకోవడానికి సిద్ధమవుతుంది. నేను శైలజ సినిమా ద్వారా తెలుగింటి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆమె తొలి నాలుగు సినిమాల వరకు ఎలాంటి గ్లామర్ షో చేయకుండానే కెరీర్ ను నెట్టుకొచ్చింది కానీ ఆ విధంగా చేయడం వల్ల ఎక్కువ సినిమా అవకాశాలు పెద్ద సినిమా అవకాశాలు రావని తెలుసుకొని మెలమెల్లగా తన పంథా మార్చుకుంది.

ఆమె నటించిన గత సినిమా సర్కారు వారి పాట తో యువతను పిచ్చెక్కించే గ్లామర్ చూపించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఇంకొంత హద్దు మీరుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులను బట్టి ఆమె సినిమాలలో మరింత గ్లామర్ చూపించే అవకాశం ఉంది అని ఆమె అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుందని కూడా చెబుతున్నారు. ఇప్పటిదాకా తన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన గ్లామర్ షో ద్వారా కూడా వారిని ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. మొదట్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి వాటి ద్వారా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిన ఈమె ఇప్పుడిప్పుడే కమర్షియల్ సినిమాలను ఒప్పుకుంటూఉంది. ఆ కమర్షియల్ సినిమాలలో తప్పకుండా గ్రామర్ షో చేయవలసి ఉంటుంది కాబట్టి ఆమె ఇప్పటినుంచి తన గ్లామర్ ను ప్రేక్షకులకు పంచడానికి సిద్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: