తమన్నా కి దానిపై ఇంట్రెస్ట్ లేదా!!
కొత్త హీరోయిన్లు యువ హీరోయిన్లు రావడంతో ఈమెకు ఈ అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పాలి. అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో సినిమాలను చేస్తూ ఆమె తన కెరీర్ను ఇంకా బిజీగా ముందుకు వెళ్లేలా చేసుకుంటుంది. దీనితో పాటే వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ ఆమె గతంలో కంటే ఎక్కువ బిజీగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ విధంగా ఆమెకు ఏర్పడిన మార్కెట్ తప్పకుండా ఆమెకు చాలా అవకాశాలను తెచ్చిపెడతాయని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తే తన కెరీర్ కు ఏమైనా ఉపయోగపడుతుందని ఒకరు ఇచ్చిన సలహాను తమ న్నా లైటు తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్ట్ లేనట్టుగా ఆమె మాట్లాడటం నిజంగా ఎవరికైనా ఆశ్చర్యపరిచే విషయం అనే చె ప్పాలి. అసలే అవకాశాలు లేని సమయంలో ఇలాంటి కామెంట్లు అవసరమా అన్నట్లుగా కొంతమంది అభిమానులు ఆమెకు సూచిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ అనే సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటిదాకా తెలుగులో ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదని చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో ఆమెకు సినిమా అవకాశాలు ఏవిధంగా వస్తాయో చూడాలి. తమన్నా నటన పరంగా, గ్లామర్ పరంగా ఎలా చేస్తుందో ఇప్పటికే చాలా సినిమాల ద్వారా నిరూపించింది.