నందు హీరోగా..బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. ఇక ఈ మూవీ చాలా గ్యాప్ తరువాత నవంబర్ 4న రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే టీమ్ కు టైమ్ తక్కువ ఉండంతో సడెన్ గా పబ్లిసిటీపై దృష్టిపెట్టింది. ఇక అందులో భాగంగా.. రష్మీని ప్రమోషన్స్‌కి రావడంలేదు... ఆమె దొరకలేదు అంటూ హీరో నందు ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.అయితే ఈ వీడియోలో నందూ మాట్లాడుతూ.. రష్మీ సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఇక మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు.... పొగరు చూపిస్తుంది.. అందుకే ఆమె ఫొటోషూట్‌లో పాల్గొంటున్న ప్లేస్‌కి వచ్చాము... అంటూ..
రష్మీని కలిసి నువ్వు ఎందుకు ప్రమోషన్స్‌కు రావు అంటూ నందు ప్రశ్నించాడు.ఇక దాంతో కోపం వచ్చిన రష్మీ.. సినిమా గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు.. వాటికి నేను ఆన్సర్ చేయలేను... అందుకే రావడంలేదు అంటూ లైవ్ లో సమాధానం చెప్పింది.అయితే ఇదంతా ఫ్రాంక్ అంటూ అప్పుడు నందు విషయాన్ని రివిల్ చేయగా. ఇక ఈ విషయం గురించి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ యాంకర్ వివరణ ఇచ్చింది. అయితే వాళ్లు ఫ్రాంక్ చేశారేమో కాని.. ఇది నిజంగా ఫ్రాంక్ కాదు...అంటూ రష్మీ ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చింది.ఇకపోతే అది ప్రాంక్ వీడియో కాదు. నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను. ఈ సినిమా అసలు విడుదలవుతుందో.. లేదో అనే పరిస్థితిలో ఉండగా.. సడెన్‌గా విడుదల అన్నారు. ఇక నేను వాళ్లు వచ్చిన టైమ్‌లో వేరే షూట్లో ఉన్నాను.... వస్తావా? లేదా? అంటూ అసలాగడం లేదు. అంతేకాదు నేను వేరే షెడ్యూల్లో ఉండగా..
వారు ఆ షూట్‌కి వచ్చేశారు...అని వివరంగా చెప్పింది రష్మి.వచ్చినవాళ్లు కామ్ గా ఉండకుండా.. నన్ను రెచ్చగొట్టడానికి చూశారు.ఇక దాంతో కోపంవచ్చి నేను ప్రమోషన్ కు రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కోపంగా అన్నాను.అయితే ఇది నిజంగా జరిగింది. ఇక దాన్ని ఫ్రాంక్ అని పేరు పెట్టారు అంతే అని అసలు విషయం రివిల్ చేసింది రష్మి గౌతమ్.ఇకపోతే నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను.. కానీ వాళ్లకి తొందర ఆగలేదు.ఇక చాన్స్ దొరికితే చాలు బాత్రూమ్లో కూర్చుని ఉంటే కూడా కెమెరాలు పెట్టేట్లు ఉన్నారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది రష్మి.అంతేకాదు కాస్త ఆగండి వస్తాను అంటే.. లేదు వెంటనే రావాలి అంటే ఎలాగా..? నాకు నా షెడ్యూల్స్ ఉంటాయి కదా అంటూ.. రష్మి వివరణ ఇచ్చింది..!!