ఇప్పుడు చిన్నా,పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమా నేషనల్ రిలీజ్‌ను టార్గెట్ చేస్తున్నాయి..టాప్ స్టార్స్ తమ పరిధిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. విదేశాల్లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు బిగ్ స్కెచ్ వేస్తున్నారు. ఇండియన్ కు ఓవర్ సీస్‌లోనూ మంచి మార్కెట్ కనిపిస్తోంది. గతంలో బాహుబలి, దంగల్ లాంటి లు చైనా మార్కెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ వసూళ్ల కారణంగానే ఈ లు 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వగలిగాయి. అందుకే ఇప్పుడు విదేశీ మార్కెట్ మీద కూడా సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు మన మేకర్స్.
లేటెస్ట్‌గా ట్రిపులార్ కూడా ఓవర్ సీస్‌లో గట్టిగా సౌండ్ చేస్తోంది. జపాన్ రిలీజ్‌ను సీరియస్‌గా తీసుకున్న ట్రిపులార్ మేకర్స్… భారీగా ప్రమోట్ చేశారు. దర్శకుడు రాజమౌళి తో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని జపాన్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో కి మరో టాప్ హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు కోలీవుడ్ మార్కెట్‌కే ఫిక్స్ అయిన దళపతి విజయ్ ఇప్పుడిప్పుడే మార్కెట్ ఎక్స్‌పాన్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు..
విజయ్ నటిస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ చేస్తున్న విజయ్… ఇప్పుడు అదర్ కంట్రీస్ లోనూ బిగ్ రిలీజ్ మీద దృష్టి పెట్టారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో విజయ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మాస్టర్. తమిళ్‌తో పాటు తెలుగు లోనూ మంచి వసూళ్లు సాధించిన ఈ ను జపాన్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏదో మొక్కుబడిగా డబ్ చేసి రిలీజ్ చేయటం కాకుండా… ప్రమోషన్ విషయం లోనూ సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. హీరో విజయ్‌ని ప్రమోషన్ కోసం జపాన్ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు మేకర్స్..ఇది ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి..