టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28 వ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ తల్లి గారు ఇందిరా దేవి గారు మృతి చెందడంతో మహేష్ బాబు సినిమాకి కాస్త బ్రేక్ తీసుకున్నారు. తన తల్లిగారికి సంబంధించిన పనులు అన్నీ అయిపోయాకా ఆ తరువాత ఆ బాధని మర్చిపోడానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లడం తెలిసిందే. ఇక ఆ ట్రిప్ ముగించుకొని మళ్ళీ తిరిగి మహేష్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని మహేష్ కి వినిపించలేదట. ఆ కారణంగానే ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్ గా ఫైనల్ స్క్రిప్ట్ ని మహేష్ బాబుకి త్రివిక్రమ్ వినిపించగా మహేష్ బాబుకి బాగా నచ్చేసిందట. అయితే తరువాతి షెడ్యూల్ లో ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే కూడా వుండాలి.ఎందుకంటే ఆమె మహేష్ తో కలిసి చేసే కొన్ని సీన్స్ వున్నాయట.అయితే ఇటీవల పూజా హెగ్డే కాలికి గాయం అవ్వడంతో ఆమె కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటోంది.
డిసెంబర్ నెలకి కానీ పూజా సెట్లో అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల ఈ మూవీ తరువాతి షెడ్యూల్ ని డిసెంబర్ నెలలో మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. అప్పుడు పూజా హెగ్డే గాయం నయం కానుంది కాబట్టి తను కూడా సెట్ లోకి రావడానికి అప్పుడు రెడీగా వుంటుంది. అందుకే డిసెంబర్ నెలలో షూటింగ్ తరువాతి షెడ్యూల్ ని ప్రారంభిస్తారని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో మహేష్ మరోసారి ట్రిప్ కి వెళుతున్నాడట.ఇంకా అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసి మహేష్ కి త్రివిక్రమ్ కి వినిపించగా మహేష్ కి ఆ ట్యూన్స్ అస్సలు నచ్చలేదట. త్రివిక్రమ్ కూడా ఆ ట్యూన్స్ పై చాలా అసంతృప్తిగా ఉండగా దీంతో మహేష్ థమన్ ని తొలగించి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుందాం అని త్రివిక్రమ్ కి సూచించాడట. ప్రస్తుతం దీనిపై చర్చలు నడుస్తున్నాయి. ఇలా ఏదో ఒక కారణంతో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతుండడంతో మహేష్ ఫ్యాన్స్ మూవీ టీంపై చాలా కొంపంగా వున్నారు. సోషల్ మీడియాలో మూవీ టీంని టాగ్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ కోపంతో పోస్టులు చేస్తున్నారు.అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.