చరణ్ చేసిన సినిమాలల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏంటో తెలుసా..!?

frame చరణ్ చేసిన సినిమాలల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏంటో తెలుసా..!?

Anilkumar
ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు . ఇక రీసెంట్గా ఆర్ ఆర్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాంచరణ్ ..ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .అయితే ఈ సినిమా అయిపోగానే మళ్లీ హిట్ ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు.  

ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న చిరంజీవి ..చరణ్ సినిమాలలో ఒక సినిమాను ఎందుకు చేశాడు రా అంటూ ఇప్పటికి బాధపడుతున్నాడట .  ఆ సినిమాని స్వయనా యాక్సెప్ట్ చేసింది చిరంజీవి కావడంతో మరింత బాధపడుతున్నారట . ఇక ఆ సినిమా మరేదో కాదు సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన జంజీర్ . అయితే హిందీలో జంజీర్.. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త టాక్ ని సంపాదించుకుంది.ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియాంక చోప్రా కు రామ్ చరణ్ తమ్ముడు లా ఉన్నాడంటూ కామెంట్స్ పంపించాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ నటన డిజాస్టర్ అంటూ మెగా ఫాన్స్ సైతం ఆయన పై మండిపడ్డారు . మొదట ఈ కథను విన్నప్పుడు చిరంజీవికి ఈ స్టోరీ రామ్ చరణ్ కు బాగా సెట్ అవుతుందని అనుకున్నారట.  డైరెక్షన్లో ఫాల్ట్ కారణంగా సీన్స్ మార్చేస్తూ చరణ్ కు నటించే స్కోప్ లేకుండా ఒకే కంటెంట్ తీసుకెళ్లారని ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిందని ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట .  ఈ సినిమాను దగ్గరుండి సైన్ చేయించింది చిరంజీవి కావడంతో.. నా కొడుకు జీవితంలో నేను ఇలాంటి మిస్టేక్ చేసానా అని సురేఖ చెప్పుకొని బాధపడుతూ ఉంటారట . అయితే ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు ..ఆ మాయకు చరణ్ కూడా బలైపోయాడు అన్నది మాత్రం వాస్తవం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: