యంగ్ టైగర్ హీరోగా ఇటీవల నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1150 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే చాలా శరవేగంగా జరుగుతోన్నాయి.తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు.ఇక ఈ సినిమాకు తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న అనిరుధ్ రవి చందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అందుకే ఈ సినిమా మ్యూజిక్ గురించి దర్శకుడు కొరటాల శివతో చాలా కూల్ గా సోఫాలో కూర్చొని సాంగ్స్ ఎలా ఉండాలో డిస్కస్ చేస్తోన్న ఫొటోలను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.ఎన్టీఆర్ 30 వ సినిమా సినిమా తనకు చాలా స్పెషల్ అంటూ ఈ ఫొటోకు కాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోన్నాయి.
ఇక ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్‌ను అందించడం ఇదే మొదటిసారి. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో వస్తున్న సినిమా ఇది.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించి ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు ప్రచారం జరిగింది. కానీ చిత్ర యూనిట్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ పేరును ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేనితో కలిసి నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన తారక్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.మరి చూడాలి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో అనేది.ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ దాన్ని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.