అడవి శేష్ "హిట్ - 2" పై భారీ అంచనాలు... హిట్ కొడతాడా !
ఈ సినిమా టీం సక్సెస్ మీట్ లోనే సీక్వెల్ ను ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా వెయిట్ చేశారు. కానీ సీక్వెల్ లో హీరోగా విశ్వక్ సేన్ కాకుండా పాన్ ఇండియా హీరో అడవి శేష్ హీరోగా చేయడం విశేషం. "హిట్ - ది కేస్ 2 " పేరు మీద విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ లు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. డైరెక్టర్ శైలేషు కొలను ఈ సినిమాను కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఒకే ఒక్క సీరియల్ హత్యను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ గా అడవి శేష్ మరోసారి అద్భుతంగా చేశాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకు వచ్చి భారీ హైప్ ను తీసుకువచ్చారు. ఇందులో మీనాక్షి చౌదరి , కోమలి ప్రసాద్, రావు రమేష్ , పోసాని కృష్ణమురళి లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఎం ఎం శ్రీలేఖ మరియు జాన్ స్టీవర్ట్ ఈడూరి లు అందించారు. అడవి శేష్ చేస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అయ్యి అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు.