తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికి తెలుసు..ప్రస్తుతం సీజన్ 6 జరుపుకుంటుంది..ఈ సీజన్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది..నేటి తో ఈ షోకు మంగళం పాడనున్నారని తెలుస్తుంది.ఈ షో గ్రాండ్ ఫినాలే ఈరోజు జరగనున్న సంగతి తెలిసిందే..సెప్టెంబర్ 4న మొదలైన ఈ సీజన్ నేటితో ముగింపు పలకనుంది. మొత్తం 21 కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ 6.. ఫైనల్‌కి ఐదుగురితో చేరింది.
ఇక ఈ వారం ఇచ్చిన ఛాలెంజ్‌లో రోహిత్, శ్రీసత్య నెగ్గి ప్రేక్షకులని ఓట్లు అడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఓట్లు అడిగే అవకాశం ఇచ్చేందుకు హౌస్‌మేట్స్‌కి టాస్క్‌లు ఇవ్వగా.. శ్రీహాన్, కీర్తి గెలిచి ఆడియన్స్ తో మాట్లాడారు.ఈ సందర్భంగా మాటలు, నా యాటిట్యూడ్ వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. నా ప్రవర్తన వల్ల బాధపడుతున్నారని తెలిసాక, నేను సరిదిద్దుకున్నాను.
రేవంత్ ‘టికెట్ టు ఫినాలే’ వదిలేయడం వల్ల నాకు వచ్చిందని అందరూ అంటుంటే నాకు బాధగా ఉంది. అనుకోని పరిస్థితిలో బిగ్‌బాస్ కి వచ్చా, ట్రోఫీ గెలవాలనే ఉద్దేశంతోనే ఆట అడా. నాకు ఓటు అడిగే అర్హతఉందో..లేదో.. నాకు తెలియదు. అది ఓట్లు వేసి మేరే నిర్ణయించాలి అంటూ శ్రీహాన్ అన్నారు.బిగ్‌బాస్ ఎలిమినేషన్ ఎప్పుడు వీకెండ్ లోనే జరిగేది. కానీ అందరికి షాక్ ఇస్తూ.. బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కి తెర లేపాడు.
ఈ క్రమంలోనే నిన్న సడన్ గా కంటెస్టెంట్స్ అందర్నీ బ్యాగ్‌లు సద్దుకోమని చెప్పి, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని హౌస్‌మేట్స్ ప్రశ్నించాడు బిగ్‌బాస్. దీంతో హౌస్‌లో ఎక్కువమంది కీర్తి పేరు చెప్పారు.కానీ అందరి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తూ.. ఫినాలేకి వెళుతుంది అనుకున్న శ్రీ సత్యని ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. దీంతో శ్రీ సత్య బ్యాగ్ సర్దుకొని బయటకి వచ్చేసింది. ఎలిమినేట్ అయ్యినందుకు లోలోపల బాధ పడుతున్నా బయటకి ధైర్యంగా ఉన్నట్లు ప్రవర్తించింది శ్రీ సత్య..ఆమె ఎలిమినేషన్ ను ఒర్వలెని రేవంత్ కంటతడి పెట్టారు.