అజిత్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా!!
వారసుడు తునివు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇవి తెలుగు లోకూడా విడుదల అవుతుండగా ఇక్కడ కూడా భారీ స్థాయి లో పోటీ ఏర్పడింది. ముఖ్యంగా అజిత్ అయితే ప్రతిసారి తన ప్రతి సినిమాతో ఈజీగా 100 కోట్ల మార్కెట్ అయితే అందుకుంటూ ఉన్నాడు. ఇక ఈసారి కూడా తునివు సినిమాతో అదే తరహాలో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన బజ్ అయితే అంత ఎక్కువగా కనిపించడం లేదు.
విజయ్ మళ్ళీ ఎప్పటిలానే వారసుడు సినిమాతో కొంత హైప్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా అజిత్ తునివు సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. తెలుగులో ఎలాంటి టైటిల్ సెట్ చేసారు అని వివరాల్లోకి వెళితే కొద్దిసేపటికి క్రితమే అధికారికంగా తెలుగు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమా తెగింపు అనే పేరుతో విడుదల కాబోతుండగా ఈ పోస్టర్ అందరిని ఎంతో ఆకట్టుకుంటుంది. మరి వరుస సినిమా లతో తెలుగు లో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ఈ హీరో ఈ సినిమా తో ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తుందో చూడాలి.