దుమ్మురేపిన ధమాకా కలెక్షన్స్..ఫస్ట్ డే ఎంతంటే?

Satvika
మాస్ హీరో మాస్ మహరాజా రవితేజ ఇప్పుడు ధమాకా సినిమా తో ప్రేక్షకుల ను పలకరించాడు... ఈ సినిమా ను ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, హైపర్ ఆది మొదలగు వారు కీలక పాత్రల్లొ కనిపించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌ పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నిన్న గ్రాండ్ ప్రేక్షకు ల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రాఘవెంద్ర రావు హీరోయిన్ శ్రీ లీల నటించింది. సీనియర్ హీరో సరసన నటించడం పై ఆమె గతంలో ఎన్నో ఇంటర్వ్యూ లలో చెప్పుకొచ్చింది..అవన్నీ కూడా ఇప్పుడు సినిమా కు ప్లస్ అయ్యాయి.. సినిమా మొదటి షో కే మంచి టాక్ ను అందుకుంది.. కథ రొటీన్ గా ఉన్నా కూడా.. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌, ఫైట్స్‌, శ్రీలీల గ్లామర్ షో, కామెడీ సన్నివేశాలు సినిమాకు మరో హైప్ ను క్రియేట్ చేశాయి..


అలాగే రవితేజ ఇందులో డ్యూయల్ రోల్ పోషించి టాప్ లేపేసారు. ఆ సినిమా కు పోటీగా నిఖిల్ హీరో గా తెరకెక్కిన `18 పేజెస్‌` వచ్చిన కూడా..ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను అందుకుంది.. మన రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.. రూ. 5.26 కోట్ల షేర్‌, రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. 13.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.ఎలా అందుకుంటుందొ చూడాలి.. మొత్తానికి ఈ సినిమా తో రవితేజ హిట్ ను అందుకున్నాడని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: